జనం న్యూస్ ; 25 ఏప్రిల్ శనివారం: సిద్ధిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్ ;
సిద్దిపేటలోని శ్రీవాణి స్కూల్ ప్రాంగణంలో ఈరోజు “యెలిగేటి ఆర్ట్స్ అకాడమీ” ప్రారంభ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ అకాడమీని శ్రీవాణి స్కూల్ డైరెక్టర్ సి.హెచ్. సత్యం తన చేతుల మీదుగా ప్రారంభించి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా కళాకారుడు వై. రమేష్ మాట్లాడుతూ, తాను చిత్రలేఖనంలో టి. టి . సి ట్రైనింగ్ పూర్తి చేసుకుని విద్యార్థులకు కళా విద్యను అందించాలని, తమలోని ప్రతిభను వెలికితీసే వేదికగా ఈ అకాడమీని ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కళ అనేది వ్యక్తిత్వ వికాసానికి ఎంతో దోహదపడుతుందని, విద్యార్థులు చదువుతో పాటు చిత్రలేఖనంపై కూడా ఆసక్తి పెంచుకోవాలని సూచించారు.
డైరెక్టర్ సి.హెచ్. సత్యం మాట్లాడుతూ, విద్యార్థులలో సృజనాత్మకత పెంపొందించడానికి ఇలాంటి అకాడమీలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. వై. రమేష్ సేవలను అభినందిస్తూ, ఈ అకాడమీ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.అనంతరం ఉపాధ్యాయులు, సిబ్బంది మరియు అతిథులకు స్వీట్లు పంచి ఆనందాన్ని పంచుకున్నారు. కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో విజయవంతంగా ముగిసింది.


