జనం న్యూస్ ఏప్రిల్ 25 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం అవిడిపేట మరియు దొంతుకుర్రు గ్రామంలో అలాగే తాళ్లరేవు మండలం పెదబాపనపల్లిలో జరిగిన డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి వేడుకల్లో అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, ఆయన సేవలను స్మరించుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా ఎంపీ హరీష్ మాధురి మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను సాధించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆయన చూపిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని మనం నేటికీ అనుసరిస్తున్నామని, ప్రజాస్వామ్య భారతదేశాన్ని ముందుకు నడిపించే ప్రధాన శక్తి రాజ్యాంగమేనని ఆయన తెలిపారు.అగ్రికుల క్షత్రియ చైర్మన్ మాజీ నాగిడి నాగేశ్వరరావు మండల మాజీ అధ్యక్షులు నడింపల్లి సుబ్బరాజు ముమ్మిడివరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఓగూరి బాగ్యశ్రీ, జిల్లా టీడీపీ అధ్యక్షుడు గుత్తుల సాయి, మురమళ్ళ వీరేశ్వర స్వామి దేవస్థానం పాలక మండలి సభ్యులు త్సవటపల్లి నాగేంద్ర రావు(నాగు), ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్, నాయకులు నడింపల్లి సుబ్బరాజు, త్సవటపల్లి శ్రీనివాస్, గిడ్డి రత్నశ్రీ, విత్తనాల బుజ్జి, గోకరకొండ సత్యనారాయణ, పిఎస్విన్ రాజు, ( విలేకరు రాజు) కాట్రేనికోన మండల టిడిపి అధ్యక్షులు చెల్లి సురేష్, , మాది యోగేశ్వరి, రాగుర్తి సత్తిబాబు, రాగుర్తి వెంకటరమణ, నీలం బాలయోగి, ధారా వెంకటరమణ, వెంట్రు రాంజీ, మోకా బాల ప్రసాద్, వంగా దుర్గా బాబు, ఎంపిడిఓ బి. రాజేశ్వరరావు, తహసిల్దార్ రవి కిరణ్, వివిధ గ్రామాల కూటమి నాయకులు, ప్రముఖులు, అధికారులు పాల్గొన్నారు.



