Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 14, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు నాయిని రజిత మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు అల్కలాంబ సూచన మేరకు తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మొగిలి సునీతారావు ఆమెను నియామకం చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాదులోని గాంధీ భవన్ లో ఈరోజు నియామక పత్రం అందజేశారు. అనంతరం నాయిని రజిత మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన హుస్నాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్రస్థాయిలో మహిళా సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరిస్తానని అన్నారు. నాయిని రజిత రాష్ట్రస్థాయిలో బాధ్యత చేపట్టడం వల్ల హుస్నాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు.