

గ్రామాలలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం
జనం న్యూస్ రిపోర్టర్ మండపేట నియోజవర్గం ఫిబ్రవరి 14 (అంగర వెంకట్)రాబోయే అయిదేళ్లలో నిరుద్యోగులకు రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పేర్కొన్నారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం గెలుపు కోరుతూ మండపేట మండలం, తాపేశ్వరం, ఇప్పనపాడు గ్రామాలలో మండపేట నియోజకవర్గ జనసేనపార్టీ ఇన్ చార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ అబ్జర్వర్ రాష్ట్ర తెలుగుదేశంపార్టీ కార్యదర్శి రాజాన రమేష్ కూటమి నాయకులు, కార్యకర్తలతో కలసి ఆయన పర్యటించారు. పట్టభద్రులను కలసి ఓట్లు అభ్యర్ధించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఇచ్చిన హామీ మేరకు త్వరలోనే మెగా డీఎస్సీ నిర్వహించేందుకు ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రభుత్వం ముందుకు వెళుతోందని చెప్పారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కోసం స్కిల్ డెవలప్మెంట్, ఎస్.ఇ.ఇ.డి.ఎ.పి ద్వారా శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరాన్ని గెలిపించడానికి మొదటి ప్రాధాన్యత ఓటును వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు చేసుకున్నవారంతా ఈనెల 27న నిర్వహించనున్న ఎన్నికల్లో కూటమి బలపరచిన అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరాన్ని గెలిపించాలని కోరారు. వేగుళ్ళ లీలా కృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో కొనసాగుతోందని ఎక్కడికి వెళ్లినా ప్రజలే చెబుతున్నారని అన్నారు. వారంతా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రశంసిస్తూ తప్పనిసరిగా ఓట్లు వేస్తామని ప్రజలు చెబుతుండటం శుభపరిణామం అన్నారు. ముఖ్యంగా అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపడుతుండటంతో ప్రజలు సానుకూలంగా ఉన్నారని అన్నారు. కేంద్రప్రభుత్వం ఇస్తున్న సహకారం పట్ల ప్రజలు కూటమి ప్రభుత్వం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండపేట మండల అధ్యక్షులు యరగతపు బాబ్జి, ఇప్పనపాడు గ్రామ సర్పంచ్ కుంచె వీరమణి ప్రసాద్, నూని వీర్రాజు చౌదరి, ముత్యాల పట్టాభి, ముత్యాల సత్యనారాయణ, గోసాల సుజాత ప్రసాద్, గుత్తుల శ్రీనివాస్, వాసంశెట్టి శ్రీను, నరిసిపల్లి మణి, రాళ్లపల్లి శివరాం, బొక్కా రాంబాబు, కోరా శివ శ్రీ, కోరా జనతా, చోడె పాపారావు, రిమ్మలపూడి వాసు, టి.బాచి, ఎన్.వెంకటరావు, ఆనంద్, చిన్న, రాజు, శ్రీను, అప్పన్న, యోహాను, గంగరాజు, సత్తిబాబు, సూరిబాబు, కూటమి నాయకులు, కార్యకర్తలు, తదితర్లు పాల్గొన్నారు.