జనం న్యూస్ ఏప్రిల్ 28 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలం కాకతీయుల కళావైభవానికి ప్రతీక. రాష్ట్రంలోనే రెండో పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి. భక్తులు కోరిన వెంటనే వారి కోర్కెలు తీర్చే కలియుగ దైవం శ్రీ మత్స్యగిరి స్వామి మండల కేంద్రంలోని అతి పురాతనమైన శ్రీ మత్స్యగిరి స్వామి ఆలయం కాకతీయుల కళావైభవానికి ప్రతీకగా నిలుస్తుంది. రాష్ట్రంలోనే రెండో మత్స్యగిరి స్వామి పుణ్యక్షేత్రంగా.ప్రసిద్ధిగాంచింది. శ్రీ మత్స్యగిరి స్వామి వారి కి ప్రతి సంవత్సరం వైశాక శుద్ధ పౌర్ణమి పంచమ రాత్రి ఆగమ శాస్త్ర ప్రకారం శ్రీ మత్స్యగిరి స్వామి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఆ క్రమంలోనే ఏప్రిల్ 29 బుధవారం నుండి మే 3 ఆదివారం వరకు ఐదు రోజులపాటు బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవాలయ ట్రస్టు బోర్డు చైర్మన్ సామల బిక్షపతి తెలిపారు. వేసవికాలం దృష్ట్యా భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు వేసినట్లు వెల్లడించారు.ఆలయ చరిత్ర. శాయంపేట గ్రామ పొలిమేరలోని మచ్చర్లయగుట్టపై శ్రీ మత్స్యగిరి స్వామి ఆరు శతాబ్దాల క్రితం సుమారు 570 సంవత్సరాలకు కొలువుదీరినట్లు పూర్వీకులు చెబుతున్నారు. మహావిష్ణువు దుష్ట శిక్షణకై దశావతారాలలో భాగంగా మొదట మత్స్య అవతారంగా వెలిసినట్లు చెబుతున్నారు. మచ్చర్లయ్య గుట్ట వద్ద గ్రామ్య భాషలో శాలివాహన శకంలో వేయించిన శిలాశాసనం ద్వారా ఆనాటి దేవాలయ చరిత్ర తెలుస్తుంది. గుట్ట లోపల బండరాయిపై సహజ సిద్దంగా చేప అవతారంలో స్వామివారు దర్శనమిస్తారు. ఇక్కడ 14 దేవాలయాలు 24 మంది అర్చకులు ఉండేవారని శిలాశాసనం ద్వారా తెలుస్తుంది. ఈ గుట్ట లోపలకి వెళ్లేందుకు ఒకే ఒక చిన్న మార్గం ఉంటుంది. అప్పుడు నిర్మించిన చెరువు నేటికీ అదే దేవుని చెరువు పేరుతో పిలువబడుతుంది. కాకతీయ సామంత రాజు కొత్తగట్టు సీమ పాలకుడు రేచర్ల దర్శనాయుడు తన తల్లిదండ్రులు సింగమాంబ సింగమ నాయుడు దేవాలయం నిర్మించినట్లు తెలుస్తుంది. కాలక్రమంలో మచ్చర్లయ్య గుట్ట వద్ద నుంచి గ్రామం దూరంగా వెళ్లిపోయింది. గ్రామం మధ్యలో రాతితో శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయాన్ని నిర్మించారు దేవాలయం గోపురం పైన మహావిష్ణు దశావతారాలు భక్తులకు దర్శనమిస్తాయి. కార్యక్రమా వివరాలు. ఏప్రిల్ 29వ తేదీ బుధవారం ఉదయం అధ్యాయనోత్సవం తోలక్కo ప్రారంభం పుట్ట బంగారు సేవ మధ్యాహ్నం ధ్వజారోహణము గరుడ ముద్ద. సంతానం లేని దంపతులు గరుడ ముద్ర ప్రసాదము స్వీకరించడం ద్వారా సంతానం కలుగుతుంది ప్రసిద్ధి గాంచింది. రాత్రి ఎదురుకోళ్లు. 30 తేదీ గురువారం ఉదయం 11 గంటలకు కళ్యాణోత్సవం. మధ్యాహ్నం 1 గంటలకు మహా అన్నదాన కార్యక్రమం మే 1 తేదీ శుక్రవారం ఉదయం పూర్ణాహుతి సాయంత్రం 6 గంటలకు గజవహన సేవ గుట్టమీదికి పోవటం మే 2 తేదీ సాయంత్రం రథోత్సవం స్వామివారు అలుకతీరుట సాంస్కృతిక కార్యక్రమాలు మే 3వ తేదీ ఆదివారం ఉదయం చక్రవరీ సాయంత్రం నాకబలి పుష్పయాగం ద్వాదశ ప్రదక్షిణాలు పండిత సన్మానంతో ఉత్సవాలు ముగిస్తాయని దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి తెలియజేశారు…..


