Listen to this article

జనం న్యూస్, ఏప్రిల్ 28(జిల్లా ఇంచార్జ్ )

జమ్మికుంట: మున్సిపల్ ఉద్యోగిపై జరిగిన దాడి ఘటనపై జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో ఆగ్రహావేశం వ్యక్తమైంది. మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ ఆదేశాల మేరకు, మున్సిపల్ మేనేజర్ రాజిరెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగులు మంగళవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో మున్సిపల్ కార్పొరేటర్ భర్త సానిటరీ ఇన్స్పెక్టర్‌పై దాడి చేయడం తీవ్రంగా ఖండనీయమన్నారు. ప్రజా సేవలో నిమగ్నమైన మున్సిపల్ సిబ్బందిపై ఇలాంటి దాడులు అంగీకారయోగ్యం కాదని పేర్కొన్నారు.దాడికి పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుని, మున్సిపల్ ఉద్యోగులకు తగిన భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.ఈ నిరసన కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ వాణి, భాస్కర్, శ్రీనివాస్, వార్డ్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.