Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 28 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి

టిపిసిసి వైస్ ప్రెసిడెంట్ మరియు కూకట్పల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ బండి రమేష్ బండి రమేష్ మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో కార్మికుడే రాజు.. అందుకే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ.. ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపారు సీఎం రేవంత్ రెడ్డి కేవలం మూడు రోజుల సమ్మెతోనే ఏండ్ల‌ నాటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపింది ప్ర‌జా ప్రభుత్వం అని కొనియాడారు..కూకట్పల్లి నియోజకవర్గ మాజీ అధ్యక్షులు శేరి సతీష్ రెడ్డి మాట్లాడుతూ నాడు దొర గడీల్లో బందీ అయిన బతుకులు.. నేడు రేవంతన్న అండతో రోడ్డెక్కిన ప్రగతి చక్రాలు. నాడు కొలువు పోతుందేమోనన్న భయం.. నేడు ప్రభుత్వంలో విలీనమై పొందుతున్న అభయం.. అదే రేవంత్ అన్న ప్రభుత్వం అదే ప్రజా ప్రభుత్వం అని కొనియాడారు.కె పి హెచ్ బీ టెంపుల్ బస్టాప్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి మరియు రోడ్డు రవాణా మరియు బిసి వెల్ఫేర్ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు..ఆ తర్వాత ఆర్టీసీ కార్మికుడు నిప్పుకు ఆహుతి అయిన శంకర్ గౌడ్ ఆత్మకు శాంతి కలగాలని నివాళులర్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆర్టీసీ కార్మికులు డ్రైవర్లు కండక్టర్లు పాల్గొన్నారు… కాంగ్రెస్ పార్టీ నాయకులు కెపిహెచ్బి డివిజన్ ప్రెసిడెంట్ తమ్మినేని ప్రవీణ్ కుమార్, బాలాజీ నగర్ డివిజన్ ప్రెసిడెంట్ కృష్ణ రాజపుత్, గ్రేటర్ హైదరాబాద్ జనరల్ సెక్రెటరీ రాజేష్ గౌడ్, గొట్టిముక్కల జస్వంత్ రావు, జివిఆర్, కరుణాకర్ నాయుడు, రాఘవేందర్, సతీష్ గౌడ్, ఫణీంద్ర కుమార్, ప్రకాష్ ముదిరాజ్,రాజు ముదిరాజ్, పొడుగు అప్పారావు, నితీష్ గౌడ్, అక్బర్, కొమ్ము బాబురావు, శ్రీధర్ చారి, గిరి నాయుడు,రామకృష్ణారెడ్డి,వినోద్, హర్షవర్ధన్, శంకర్, శ్రవణ్, యూత్ కాంగ్రెస్ బాలాజీ నగర్ డివిజన్ ప్రెసిడెంట్ కళ్యాణ్ , వసంత నగర్ డివిజన్ ప్రెసిడెంట్ దుర్గాప్రసాద్, కేపీహెచ్బీ డివిజన్ ప్రెసిడెంట్ రంగస్వామి,బీ బ్లాక్ అధ్యక్షులు సంధ్య, బండి సుధా, వనజ, విజయలక్ష్మి, జయలక్ష్మి, అపర్ణ నాయుడు, స్వాతి రెడ్డి, లక్ష్మీ, యమునా, సరోజ, తదితరులు పాల్గొన్నారు.