Listen to this article

విద్యార్థిని విద్యార్థులు ఉపయోగించుకోవాలి

జనం న్యూస్ ఏప్రిల్ 28 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంధాలయ సంస్థ భీమనపల్లి శాఖా గ్రంధాలయంలో వేసవి విజ్ఞాన శిక్షణా తరగతులు ఏప్రిల్ 28 నుండి జూన్ 6వ తేదీ వరకూ” వేసవి విజ్ఞాన శిక్షణా తరగతులు “జరుగుతున్న నేపథ్యంలో మంగళవారం ఉదయం శాఖా గ్రంధాలయంలో శిక్షణ తరగతులను జ్యోతి ప్రజ్వలన చేసి ఎంపిటిసి దేశం శెట్టి రత్నకుమారి ప్రారంభించారు ఆమె మాట్లాడుతూ. విద్యార్థిని విద్యార్థులు ఈ శిక్షణ శిబిరాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు. సరస్వతిదేవి చిత్రపటానికి రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కంకటాల రాంబాబు పూజా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రంధాలయాధికారి నిమ్మకాయల శేష్ కుమార్ మాట్లాడుతూ శిక్షణా తరగతులు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ జరుగుతాయని తెలిపారు.. ప్రతి రోజూ కథలు చెప్పడం ,వినడం పుస్తక సమీక్ష,, స్పోకెన్ ఇంగ్లీష్, డ్రాయింగ్ పెయింటింగ్ వంటి వాటిలో శిక్షణ ఇస్తారని ఆయన తెలిపారు. విద్యార్థులకు వేసవి క్యాంపు అనంతరం సర్టిఫికెట్లు ,బహుమతులు అందజేయడం జరుగుతుందని శేషు కుమార్ చెప్పారు. ఈ శిక్షణా తరగతులకు తమ విద్యార్థులను తప్పకుండా గ్రంథాలయానికి వచ్చే విధంగా ఉపాధ్యాయులు సహకరించాలని ,అలాగే తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని ఈ శిక్షణ తరగతులకు పంపించే లా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ శిక్షణా తరగతులకు విద్యార్థులకు అల్పాహారం, బహుమతులు అందించే దాతలు, గ్రంథాలయానికి ఉచితంగా గ్రంధాలు అంద జేసే వారు, విలువైన ఫర్నిచర్, పుస్తకాలు మొదలైన వాటిని ఇచ్చే దాతలు తనకు తెలియజేయాలని శేషు కుమార్ కోరారు. ఈ శిక్షణ తరగతులలో స్పోకెన్ ఇంగ్లీష్, కథలు చెప్పడం వంటి వాటిలో విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి విశ్రాంత ఉపాధ్యాయులు ,ప్రొఫెసర్లు, ఉద్యోగులు, మేధావులు స్వచ్ఛందంగా పాల్గొని విద్యార్థులకు శిక్షణ ఇవ్వటానికి ముందుకు వచ్చేవారు తమ అంగీకారాన్ని శాఖ గ్రంథాలయ అధికారి శేషు కుమార్ సెల్ ఫోన్ నెంబర్ 9989817936. కు తెలియజేయాలని ఆయన కోరారు.. రాష్ట్ర ఆర్య వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కంక టాల రాంబాబు మాట్లాడుతూశిక్షణ తరగతులు విజయవంతం చేయడానికి ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు, దాతలు సహకరించాలని ఆయన కోరారు‌.టిడిపి నాయకులు మంచెం బుజ్జి, విశ్రాంత పి.ఎఫ్ అసిస్టెంట్ కమిషనర్ అద్దంకి అమరేశ్వరరావు ప్రసంగించారు.అనంతరం జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ అధ్యక్షులు శిరంగు సత్తిరాజు ఆకస్మిక మృతికి విద్యార్థులు మౌనం పాటించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు