జనం న్యూస్ ఏప్రిల్ 28 2026 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ )
ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్
కార్యక్రమంలో పాల్గొన్న పీసీసీ అబ్జర్వర్ సౌజన్య, మండల అధ్యక్షుడు ఇంద్రసేన రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సంతాజి , అశోక్ రెడ్డి,ఇతర ముఖ్య నేతలు మంత్రి పొన్నం ప్రభాకర్ మండల ముఖ్య నాయకుల సమావేశంలో గ్రామాల వారిగా పిలుస్తా..మన కాంగ్రెస్ పార్టీ నుండి ప్రతి బూత్ కి ఒక బిఎల్ఏ ఉండాలి..ఓట్ల సవరణ జరుగుతుంది మన గ్రామంలో ఎన్ని పోలింగ్ స్టేషన్ లు ఉంటే అన్ని పేర్లు తో లిస్ట్ ఇవ్వాలి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు జరుగుతుంది..కొనుగోలు కేంద్రాలు సాఫీగా జరిగేలా పార్టీ నుండి ఐదుగురు తో కమిటీ ఏర్పాటు చేయాలి గ్రామాల్లో తాగు నీటి సమస్య లేకుండా తాత్కాలిక సమస్యలు ,శాశ్వత పరిష్కారానికి కమిటీ వేయాలి..హుస్నాబాద్ నియోజకవర్గం రాష్ట్రంలో పచ్చదనం ఉండాలి.. అందరూ చెట్లు పెంచాలి..నర్సరీ లో మొక్కలు పెంచాలి..వర్షకాలంలో ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటెల కమిటీ వేయాలి ప్రతి గ్రామంలో మెడికల్ క్యాంప్ లు నిర్వహించాలి.. అందరూ ఆరోగ్య పరీక్షలు నిర్వహించుకోవాలి..స్కూల్ లో అడ్మిషన్స్ పెంచాలి.. ప్రీ ప్రైమరీ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాం.. బడి బాట ద్వారా ఇంటింటికి తిరిగి పిల్లలు చేరేలా కమిటీ వేయాలి.. పాఠశాలకు మౌలిక సదుపాయాలు అవసరమైన టీచర్లు ప్రభుత్వం ఇస్తుంది..బూత్ స్థాయి నుండి పార్టీ నిర్మాణం జరగాలి..పెండింగ్ లో ఉన్న ఇందిరమ్మ ఇళ్లు కార్యాచరణ తీసుకోవాలి.. ఇందిరమ్మ ఇళ్లు పూర్తయినవాటికి గృహప్రవేశాలు జరపాలి..పార్టీ గ్రామ,మండల శాఖ నిర్మాణం జరగాలి, అనుబంధ సంఘాల నిర్మాణం జరగాలి ,అధ్యక్షులను వేయాలి..వర్షాకాలం తర్వాత బడిబాట, ప్లాంటేషన్ ,ఇందిరమ్మ ఇళ్ళు గృహప్రవేశం ,అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ప్రతి గ్రామంలో పర్యటిస్తా..మీ గ్రామాల్లో ఉన్న సమస్యలు పై లిఖిత పూర్వకంగా ఇవ్వండి.. ఏ ఏ సమస్యలు ఉన్నాయి అని కమిటీ రాసి ఇవ్వాలి..ప్రజా పాలన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్, గ్యాస్ సబ్సిడీ, ఇందిరమ్మ ఇళ్లు,సన్న బియ్యం పంపిణీ, నూతన్ రేషన్ కార్డులు పంపిణీ,ఆర్టీసీ లో ఉచిత బస్సు ప్రయాణం , ఉద్యోగాల భర్తీ అంశాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి..



