Listen to this article

జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 14. తర్లుపాడు గ్రామంలో వేసిన శ్రీ రుక్మిణి సత్యభామ సమితి వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం నరసింహావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు, ఈవో ఈదుల చెన్నకేశవ రెడ్డి, ఆలయ అనువంశిక ధర్మకర్త జవ్వాజి విజయ భాస్కర రావు సింహ వాహనం ఉభయ దాతలు వాడేల దత్తాత్రేయ శ్రీనివాసులు వీరి సతీమణి లక్ష్మి, వాడేల వెంకటరమణయ్య వీరి సతీమణి హిరణ్మయి, వాడేల ప్రకాశరావు వీరి సతీమణి శాంత లక్ష్మి, వాడేల సుబ్బారావు వీరి సతీమణి మాధవి, వాడేల సుధాకర్ వీరి సతీమణి స్వప్న వారిచే ఘనంగా నిర్వహించారు, ప్రత్యేక పూజలు ఆలయ అర్చకులు కారంపొడి రమణాచార్యులు, భార్గవాచార్యులు, స్వామి వారి ప్రత్యేక అలంకరణ కూనపులి రమణయ్య నిర్వహించారు,అనంతరం భక్తులకు తర్లుపాడు పురవీధుల్లో విహారిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు