జనం న్యూస్, ఏప్రిల్ 29: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలో పదో తరగతి ఫలితాలు ఉత్తేజకరంగా నిలిచాయి. మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో మొత్తం 158 మంది విద్యార్థులకు గాను 156 మంది ఉత్తీర్ణత సాధించి 96.97 శాతం ఉత్తీర్ణత నమోదైంది అని మండల విద్యాశాఖాధికారి బి. ఆనందరావు తెలిపారు. తాళ్ల రాంపూర్, గుమ్మిర్యాల్, తడ్పకల్, తోర్తి, కేజీబీవీ పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించి ప్రత్యేక గుర్తింపు పొందాయి. కాగా ఏర్గట్ల హై స్కూల్‌లో ఇద్దరు విద్యార్థులు అనుతీర్ణత పొందడంతో ఆ పాఠశాల ఉత్తీర్ణత శాతం 96.97గా నమోదైంది. ఈ ఫలితాల్లో మండల టాపర్‌గా రిష్మా నిలిచి ప్రతిభ చాటుకుంది. అని విద్యాధికారి చెప్పారు.


