

వైకాపా మునిసిపల్ వింగ్ అధ్యక్షుడు గా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపిన మంగమూరి..
ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి, జనవరి 10, (జనం న్యూస్):- మార్కాపురం: మార్కాపురం మునిసిపల్ 5 వ వార్డు కౌన్సిలర్ మంగమూరి శ్రీనివాస్ ను, వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా మున్సిపల్ వింగ్ అధ్యక్షుడిగా నియమించారు. ఈ సందర్భంగా గిద్దలూరు మాజి శాసనసభ్యులు, మార్కాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త అన్నా రాంబాబుని, శ్రీనివాసులు శుక్రవారం ఉదయం కలిసి దుశ్శాలువ, పుష్పగుచ్చం అందచేసి సన్మానించారు. అనంతరం శ్రీనివాసులు మాట్లాడుతూ, నియోజకవర్గ ఇన్చార్జి అన్నా రాంబాబు,తన పట్ల నమ్మకం ఉంచి జిల్లా బాధ్యతలు అప్పగించేలా అధిష్టానం కి సిఫారసు చేశారు అని అన్నారు. అన్నా నాయకత్వంలో పని చేసి పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈయన వెంట అన్నాను కలిసిన వారిలో 5వ వార్డు వైకాపా నాయకులు ఉన్నారు.