Listen to this article

(జనం న్యూస్ ఏప్రిల్ 30 కందిబండ హరీష్ మునగాల మండల రిపోర్టర్) వేసవిలో దొంగతనాలు పెరిగే అవకాశం ఉన్నందున మునగాల మండల రైతులు,ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్ రైతులకు, ప్రజలకు సూచించారు. గురువారం ఒక పత్రిక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. పొలాల వద్ద మోటార్లు, వైర్లు, పశువుల పట్ల జాగ్రత్త వహించాలన్నారు. పిల్లలు ఈత కోసం బావులు, కాలువల వద్దకు వెళ్లకుండా తల్లిదండ్రులు కనిపెట్టుకోవాలని కోరారు. అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని చెప్పారు.