

ప్రమాద బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అండ భవిష్యత్తులో అన్ని విధాలుగా అండగా ఉంటా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి..-భవిష్యత్తులో అన్ని విధాలుగా అండగా ఉంటా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. జనం న్యూస్ ఫిబ్రవరి 15 ;హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరోసారి తన మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. ప్రైవేట్ కంపెనీ తరఫున వ్యాపార టూర్ కోసం బ్యాంకాక్ వెళ్లిన హుజురాబాద్ మండలం చేల్పూర్ గ్రామానికి చెందిన పుల్ల సృజన్ అక్కడ ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. తలకు బలమైన గాయాలు కావడంతో అతను ప్రస్తుతం బ్యాంకాక్‌లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.ఈ విషయాన్ని తెలుసుకున్న సృజన్ భార్య స్నేహ, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని కలుసుకుని భర్తను స్వదేశానికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. కుటుంబ సభ్యుల ఆవేదనను గమనించిన ఎమ్మెల్యే తక్షణమే చర్యలు ప్రారంభించారు. బ్యాంకాక్‌లోని అధికారులతో పాటు, సృజన్‌ను పంపిన ప్రైవేట్ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి అతని తిరుగు ప్రయాణానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయిస్తున్నారు బాధితునికి న్యాయమైన హక్కులు బ్యాంకాక్ పంపిన కంపెనీ సృజన్‌కు లభించాల్సిన అన్ని రకాల ప్రయోజనాలను అందించాల్సిందే అని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. అతని వైద్య ఖర్చులపైనా ప్రత్యేకంగా దృష్టి సారించి, కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూస్తానని హామీ ఇచ్చారు.కౌశిక్ రెడ్డికి బాధిత కుటుంబం పట్ల, వెంటనే స్పందించి చర్యలు తీసుకోవడం పట్ల సృజన్ కుటుంబ సభ్యులు తనకు కృతజ్ఞతలు తెలిపారు బాధిత కుటుంబానికి అండగా నిలిచిన ఎమ్మెల్యే కి మా హృదయపూర్వక కృతజ్ఞతలు అని మాచనపల్లి మాజీ సర్పంచ్ పర్లపల్లి రమేష్ పేర్కొన్నారు మానవతా విలువలకు నిలువెత్తు నిదర్శనం స్వదేశం వదలి విదేశాల్లో చిక్కుకుపోయిన బాధితుడికి సహాయం చేయడం ద్వారా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన సేవా తత్వాన్ని మరోసారి చాటారు. ఆయన స్పందనను నియోజకవర్గ ప్రజలు ప్రశంసిస్తున్నారు.