

ఆహనా పెళ్ళంట సినిమాలో కోట శ్రీనివాసరావు మాదిరిగా మారింది.జనం న్యూస్ ఫిబ్రవరి 15 జమ్మికుంట కుమార్ యాదవ్ తెలంగాణ రాష్ట్రంలోబర్డ్ ఫ్లూ వైరస్ భయాందోళనను కలిగిస్తోంది కొన్ని వారాలు గా చాలా ప్రాంతాల్లోని కోళ్ల ఫారాల్లో కోళ్లకు వైరస్ సోకి పెద్ద ఎత్తున మృత్యువాత పడుతుండడంతో చికెన్ తినేందుకు ప్రజలు భయపడుతున్నారు కోళ్ళ ఫారాల్లో లక్షల సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి బర్డ్ ఫ్లూ కారణం గా చికెన్ ధరలు భారీగా తగ్గినా భయంతో చాలా వరకు చికెన్ తినేందుకు ప్రజలు ఇష్టపడడం లేదు ప్రస్తుతం చికెన్ ప్రియుల పరిస్థితి ఆహనా పెళ్ళంట సినిమాలో కమెడియన్ కోట శ్రీనివాసరావు, ఆచరించిన పద్ధతినే ఇప్పుడు చికెన్ ప్రియులు ఆచరించే పరిస్థితి ఏర్పడింది సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ కావడం తో తెలంగాణ జిల్లాల్లో చికెన్ అమ్మకాలు భారీగా తగ్గిపోయాయి బర్డ్ ఫ్లూ భయంతో ప్రజలు మటన్, చేపల వైపు మొగ్గు చూపు తున్నట్లు తెలుస్తోంది ఈ క్రమంలోనే మటన్ , చేపలకు, భారీగా గిరాకీ పెరిగిపోయింది.