Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 15 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి వివేకానంద నగర్ డివిజన్ లో గల పటేల్ కుంట పార్క్ లో జరిగే అభివృద్ధి పనులలో భాగంగా నేడు పార్క్ లో నీటి వసతులు సంబంధించి బోర్ వేస్తున్న పనులను సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ సభ్యులుతో కలిసి పర్యవేక్షించిన డివిజన్ కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మాట్లాడుతూ వీలైనంత త్వరలో పనులను పూర్తి చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను కోరారు ఈ కార్యక్రమంలో డిగేశ్వరరావు,చెన్నారావు రవీందర్ రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు