Listen to this article

ఆటో కార్మికులకు కాంగ్రెస్ చేసిన వాగ్దానాలు అమలు చేయాలి

జనం న్యూస్ ఫిబ్రవరి 15; మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ ఎన్నికల సమయంలో ఆటో కార్మికులకు కాంగ్రెస్‌ పార్టీ చేసిన వాగ్దానాల ప్రకారం సంవత్సరమునకు రూ 12000/-లు వెయ్యిలు చెల్లించాలని,వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేసి వారి సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం, సిపిఐ జిల్లా నాయకులు సీతారాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శనివారం మండల కేంద్రంలో తెలంగాణ పబ్లిక్ అండ్ ప్రైవేట్ రోడ్ వర్కర్స్ ఫెడరేషన్ జేఏసీ సంఘాల పిలుపుమేరకు ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగినది ఈ సందర్భంగా జేఏసీ నాయకులు బచ్చలకూర స్వరాజ్యం, సీతారాం, మాట్లాడుతూ గత ప్రభుత్వం విధానాల ఫలితంగా ఆదాయాలు తగ్గితే,నేటి ప్రభుత్వం తీసుకున్న చర్యల మూలంగా ఆటో కార్మికులు ఉపాధి కోల్పోయారని, ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కనిపించటం వల్ల ఆటో డ్రైవర్లు ఉపాధిని కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం ప్రకటించిన విధంగా కార్మికులకు వత్సరమునకు రూ 12 వేల రూపాయలను వెంటనే అమలుపరచాలని. ఆదాయాలు కోల్పోయి నా ఆటో కార్మికులు నెలసరి వాయిదాలు కట్టలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే ఆటో కార్మికులను ఆదుకోవాలని, అట్లాగే ఆటో కార్మికులకు వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని, అర్హులైన ఆటో కార్మికులకు ఇందిరమ్మ ఇండ్లు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్న ప్రతి కార్మికుడికి రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రజా పంపిణీ ద్వారా 18 రకాల నిత్యవసర సరుకులను అందివ్వాలని ప్రభుత్వాన్ని కోరినారు.ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ ప్రెసిడెంట్ షేక్ జానీ మియా, కృష్ణ,నారాయణ,ఎం కరుణాకర్,శ్రీను, దానియేలు, శివ, రాంబాబు, లింగయ్య, జనార్దన్ రెడ్డి, గోపి,కరుణాకర్, సతీష్,లాల్, రఫీ,లింగ రాజు, వీరబాబు తదితరులు పాల్గొన్నారు