Listen to this article

సోషియాలజీ,సోషల్ వర్కర్ నిరుద్యోగ విద్యార్థి_జేఏసీ కన్వీనర్ జనం న్యూస్ పీబ్రవరి 15 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం లో -సోషియాలజీ,సోషల్ వర్కర్ నిరుద్యోగ విద్యార్థి_జేఏసీ కన్వీనర్ మానిక్.డోoగ్రే మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా నియామకాలు ఉద్యోగాలు మనకే వస్తాయని రాష్ట్రం లో చదువుకున్నా నిరుద్యోగ యువతి, యువకులు అందరూ ఎన్నో కలలు కన్నారు కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చి ఒక దశాబ్దం దాటినప్పటికీ రాష్ట్రంలోని వివిధ విశ్వ విద్యాలయాలు అయినటువంటి ఉస్మానియా,కాకతీయ, శాతవాహన, తెలంగాణ,పాలమూరు లాంటి విశ్వ విద్యాలయాల లో ఏం.ఎ సోషియాలజీ, సోషల్ వర్క్, రూరల్ డెవలప్మెంట్ లాంటి ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థి నిరుద్యోగుల సమస్యలను గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఇది వరకు ఉమ్మడి మెదక్,ఆదిలాబాద్,కరీంనగర్,నిజామాబాద్ జిల్లాల పట్టభద్రుల ఏమ్మెల్సీ గా ఉన్నటువంటి జీవన్ రెడ్డి ని సైతం మా సమస్యలను గత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని పలు సందర్భాలలో విన్న వించిన పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించరని ,ప్రస్తుతం మళ్ళీ ఈ ఉమ్మడి జిల్లా లలో పట్టభద్రుల
ఏమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల 27 వ తేదిన జరగబోయే కాబట్టి సోషియాలజీ , సోషల్ వర్క్, రూరల్ డెవలప్మెంట్ కోర్సు లు చేసిన నిరుద్యోగ విద్యార్థుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో చర్చించే అవకాశం కల్పించి, మా సమస్యలను పరిస్కరిస్తా మని స్పష్టమైన హామీ ఇచ్చిన వారికే ఏమ్మెల్సీ ఎన్నికలలో మా పూర్తి మద్దతు ఉంటుందని, పట్టభద్రుల ఎన్నిక లు జరుగుతున్నటువంటి నాలుగు ఉమ్మడి జిల్లా లలో కలిపి సుమారు 3000 మంది పై చిలుకు ఈ కోర్సులు చేసిన నిరుద్యోగ పట్టభద్రులు ఉన్నారని జేఏసీ కన్వీనర్ మానిక్ రావ్ డోంగ్రే పేర్కొన్నారు.