

సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ-ఉట్నూరు ప్రాజెక్టు అధికారి ఖుష్బూ గుప్తా జనం న్యూస్.
ఫిబ్రవరి 15, 2025 :కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కె ఏలియా. జైనూర్ :విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ-ఉట్నూరు ప్రాజెక్టు అధికారి ఖుష్బూ గుప్తా అన్నారు. శనివారం జిల్లాలోని జైనూర్ మండలం పానపటర్ ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి పాఠశాల పరిసరాలు, విద్యార్థులకు నిర్వహించిన స్లిప్ టెస్టుల జవాబు పత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు అధికారి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని, ప్రభుత్వం చే నియమించబడిన నిష్ణాతులైన ఉపాధ్యాయుల ద్వారా పాఠ్యాంశాల బోధన జరుగుతుందని తెలిపారు. ఈ క్రమంలో 10వ తరగతి విద్యార్థులకు నిర్వహించిన గణిత సబ్జెక్టు స్లిప్ టెస్టులో విద్యార్థుల కాఫీయింగ్ జరిగిందని నిర్ధారించి ఈ విషయమై ఆరా తీయగా స్లిప్ టెస్ట్ కు సంబంధించి ఒకరోజు ముందు నిర్వహించవలసిన సూపర్ విజన్ తరగతి నిర్వహించలేదని, విద్యార్థులచే పరీక్షలకు సంబంధించిన పాఠ్యాంశాల రివిజన్ కూడా చేయించలేదని తెలిసిందని తెలిపారు. ఈ నేపథ్యంలో పాఠ్యాంశాలకు సంబంధించి ఒక ప్రశ్నను బోధించాలని గణిత ఉపాధ్యాయుడికి సూచించగా సరిగ్గా విద్యార్థులకు వివరించలేకపోయాడని, తద్వారా సంబంధిత గణిత ఉపాధ్యాయుడి పై తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం, విద్యారంగ అభివృద్ధి కొరకు అనేక చర్యలు చేపడుతుందని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

