Listen to this article

జనం న్యూస్ జనవరి 10(రిపోర్టర్ నల్లబోతుల రాజు) అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం స్థానిక వజ్రకరూరు మేజర్ గ్రామపంచాయతీ నందు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా గోకుల్ షెడ్ ను వజ్రకరూర్ సర్పంచ్ మోనాలిసా, ఎంపీడీవో ఆఫీస్ ఏవో శ్రీనివాసులు,ఎన్ ఆర్ జి ఎస్ ఏపీవో లక్ష్మీకాంత బాయ్ ప్రారంభించారు, సర్పంచ్ మోనాలిసా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాడి పశువుల రైతులకు ఉపయోగపడే విధంగా ఎన్ ఆర్ జి ఎస్ నిధులతో షెడ్డును నిర్మించి రైతులకు అందించడం జరుగుతుంది ఈ షెడ్డు వల్ల రైతులు లాభాదాయకంగా ఎంతో అభివృద్ధి చెందుతారని దీనివలన రైతులకు మేలు జరుగుతుందని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగిందని తెలిపారు, ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు మల్లయ్య, అనిల్ కుమార్, మండల స్థాయి అధికారులు, ఎన్ ఆర్ జి ఎస్ అధికారులు,గ్రామస్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు