Listen to this article

సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు

జనం న్యూస్ పిబ్రవరి 15 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా గత వారం రోజులుగా రైల్ టెల్ సర్వర్లలో ఇబ్బందులతో సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లు దేశవ్యాప్తంగా ఆగిపోయాయని,రెండు మూడు రోజుల్లో ఈ సమస్యకు పరిష్కారం కనుగొని పత్తి కొనుగోళ్లను పునరుద్ధరిస్తామని సిర్పూర్ శాసనసభ్యులు డా. పాల్వాయి హరీష్ బాబు అన్నారు పత్తి రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దళారులను నమ్మి మోసపోవద్దని, మహారాష్ట్రలో కూడా తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన అవసరం లేదని రైతులకు కాటన్ కార్పొరేషన్ అధికారులు అండగా నిలుస్తారని తెలిపారు.