

జనంన్యూస్. 15 నిజామాబాదు. ప్రతినిధి.నిజామాబాదు.పెండింగ్ లో ఉన్న ఫీజు రియాంబర్స్మెంట్ నిధులను విడుదల చేయకపోతే వేల మంది విద్యార్థులతో చలో హైదరాబాద్ కార్యక్రమం.పి.డి.ఎస్.యూ. ఆధ్వర్యంలో చేపడతామని తెలిపారు.గత మూడు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న సుమారు ఏడు వేల కోట్ల ఫీజు రియాంబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులను వెంటనే విడుదల చేయాలని పి.డి.ఎస్. యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్. ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆర్మూర్ పట్టణంలో డివిజన్ అధ్యక్షులు ప్రిన్స్ అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించి అనంతరం పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ మాట్లాడుతూ పేద మధ్యతరగతి విద్యార్థులు ఫీజు రియాంబర్స్మెంట్ పై ఆధారపడి డిగ్రీ , పీజీ మరియు ఇంజనీరింగ్ ఫార్మసీ కోర్సులు చేస్తున్నారని, గత మూడు సంవత్సరాలుగా ఫీజు రియాంబర్స్మెంట్ నిధులు పెండింగ్ విడుదల చేయకపోవటం వలన విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు, కోర్సులు పూర్తయిన సర్టిఫికెట్స్ కాలేజీలలో ఉంటున్నాయని, పై చదువులు మరియు ఉద్యోగ అవకాశాలను లక్షలాది మంది విద్యార్థులు కోల్పోతున్నారని, విద్యార్థుల తల్లిదండ్రులపై ఫీజుల భారం పడుతుందని, కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ యాజమాన్యాలు ఫీజు రియాంబర్స్మెంట్ డబ్బులు కట్టాలని విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారని , రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలకు వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని, విద్యార్థులకు సంబంధించిన నిధులు విడుదల చేయకపోవటం సరైంది కాదని వెంటనే ఫీజు రియాంబర్స్మెంట్ నిధులు మంజూరు చేయాలని లేనిచో వేల మంది విద్యార్థులతో చలో హైదరాబాద్ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి హుస్సేన్, నాయకులు రాహుల్, కళ్యాణ్, పవన్, సాయి, రహమాన్, నిశాంత్, అక్షయ్, రిషి తదితరులు పాలుగోన్నారు.