Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి,15( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా ) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహదారు మహమ్మద్ షబ్బీర్ అలీ, జన్మదినం సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి శ్రావణ్, మండల పార్టీ అధ్యక్షుడు సుతారి రమేష్, జిల్లా కాంగ్రెస్ నాయకులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్, మాజీ ఎం పి టి సి చంద్రాగౌడ్,లు కాంగ్రెస్ నాయకులతో కలిసి గజమాలతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జన్మదినం సందర్భంగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన మోగా రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన జిల్లా కాంగ్రెస్ నాయకులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్, ను ప్రభుత్వ సలహదారు షబ్బీర్ అలీ, అభినందించి తన చేతుల మీదుగా హెల్మెట్, ప్రశంసా పత్రాన్ని అందించారు.