Listen to this article

బంజారాల ఆరాధ్య దైవం ఆహుని సంభూతుడు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్,

జనం న్యూస్,ఫిబ్రవరి 15,కంగ్టి,సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని బంజారా తండాలలో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్,286 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాజారామ్ తాండ, ముకుంద నాయక్ తాండ,చందర్ తాండ, తుకారం తాండ,ఎడ్ల రెగడి తాండ,లలో శనివారం నాడు ఘనంగా జయంతి కార్యక్రమం ను చేపట్టారు,అనంతరం సొంత సేవాలాల్ మహారాజ్ శోభాయాత్రను కంగ్టి ఎస్ఐ విజయ్ కుమార్, స్వహస్తములచే ప్రారంభించారు. శుక్రవారం ఆయా గ్రామ ల బంజారా సహోదరులు తమ దేవాలయం మందిరంలో భజన కీర్తనలు నిర్వహించి, జాగరణ చేసారు. శనివారం జయంతి లో భాగంగా శ్రీ సంత సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ప్రత్యేక అభిషేకాలు పూజలు మంగళ మహ నీరాంజనాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం అహుని సంభూతుని శోభాయాత్రను మండల కేంద్రంలో బాజా భజంత్రులతో గ్రామ పురవీధులలో ఊరేగింపుగా మందిరానికి చేరుకుని ధూప దీప నైవేద్యాలను సమర్పించారు. అనంతరం మహా అన్న ప్రసాద్ వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అహునీ సంభూతుడు సేవాలాల్ మహారాజ్ అని అన్నారు.ప్రతి ఒక్కరు వ్యాసనాలకు దూరంగా ఉండాలని, ప్రతి ఒక్కరు తమ పిల్లలకు సంస్కారవంతమైన విద్య,బుద్ధులతో పాటు ఆధ్యాత్మిక చింతనను బోధించాలని అన్నారు. అందరు ఐక్యతతో నడుచుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో తండాల కారోబారి నాయకులు, మందిరాల పూజారీలు, బంజారా యువజన సంఘాలు,గ్రామస్తులు పాల్గొన్నారు.