

జనంన్యూస్. 15.నిజామాబాదు. ప్రతినిధి : సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల&కళాశాలకు చెందిన విద్యార్థులు మండల కేంద్రంలో గల తెలంగాణ చౌరస్తా వద్ద రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని ద్విచక్రవాహనాలకు ,ఆటోలు, బస్సులు, ట్రాక్టర్ మరియు వాటి ట్రాలీలు, లారీలకు రేడియం రెఫ్లెక్టర్ స్టిక్కర్లను అతికించడం జరిగింది.ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పక ధరించి ప్రయాణం చేయాలని,అధిక వేగంతో వెళ్లరాదని ప్రమాదాలు జరిగితే కుటుంబం పెద్దను కోల్పోవడం వల్ల కుటుంబాలు పెద్దద్దిక్కును కోల్పోయి అనాథలుగా మారుతాయని వివరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తహసీల్దార్ రవీందర్ రావు. ప్రత్యేక అతిథిగా మండల విద్యశాఖ అధికారి రాములు. కానిస్టేబుల్స్ హరీష్,శంకర్ పాఠశాల కళాశాల ప్రధానోపాధ్యాయులుగడ్డం రాజేష్ రెడ్డి. ఉపాధ్యాయులు హేమలత,సాయన్న,ప్రశాంత్,ప్రియ,పీడీ కిషన్,మరియు విద్యార్థులు పాల్గొన్నారు.