

జనం న్యూస్,15 ఫిబ్రవరి,అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలం చీమలాపల్లి గ్రామంలో వెలసిన శ్రీ అన్నపూర్ణదేవి సమేత శ్రీశ్రీశ్రీ స్వయంభు కాశీ విశ్వేశ్వరస్వామి వారి ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ ప్రసాద్ పాల్గొని స్వామి వారికి పాలాభిషేకం చేసి స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.ఆలయం అభివృద్ధికి రూ. 25 వేలు విరాళంగా అందించారు.ఈ కార్యక్రమంలో అచ్యుతాపురం మండలం ప్రజా ప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, నాయకులు, గ్రామ పెద్దలు ప్రజలు అందరూ తదితరులు పాల్గొన్నారు.