

జనం న్యూస్ జనవరి 11 ముద్దనూరు : స్థానిక సువిధ స్కూల్లో శుక్రవారం ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు పాఠశాల కరస్పాండెంట్ కుడుముల శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందించారు అదేవిధంగా సంక్రాంతి పాల పొంగులు పొంగించి సంక్రాంతి సంబరాలు భాగంగా నాలుగు రోడ్లు కూడా నుండి పాత బస్టాండ్ వరకు ఎద్దుల బండిమీద స్థానిక రిటైర్డ్ తెలుగు లెక్చలర్ పుల్లారెడ్డి ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి,పిల్లల వేషాదరణలో అల్లూరి సీతారామరాజు,సుభాష్ చంద్రబోస్, భరతమాత, చత్రపతి శివాజీ, వీర పాండ్య కట్ట బ్రహ్మణ మరియు ముక్కోటి ఏకాదశి పండుగ సందర్భంగా వెంకటేశ్వర స్వామి,కృష్ణుడు వేషధారణలు అందరిని ఆకర్షించాయి అలాగే పాఠశాల ఆవరణంలో భోగిమంటలు,కోలాటం నృత్య ప్రదర్శనలతో పాఠశాల విద్యార్థులు ప్రేక్షకులను అలరించారు ఇందుకు స్థానిక ప్రజలు ప్రదర్శనలను తిలకించి హర్షద్వానాలు వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక మండల విద్యాధికారి 2 ఎం. నాగేశ్వర్ నాయక్ పాల్గొనడం జరిగింది మరియు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు.