

జనం న్యూస్ 16 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ టీడీపీ జోన్-1 కో ఆర్టినేటర్ పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి అశోక్ బంగ్లాలో కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు రెడ్డికి టీడీపీ జిల్లా అధ్యక్షుడు నాగార్జున, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ఇతర పార్టీ నాయకులు స్వాగతం పలికారు. అనంతరం జిల్లాలో పార్టీ బలోపేతం చేయుట గూర్చి ఆయన పార్టీ నాయకులతో చర్చించారు.