Listen to this article

జనం న్యూస్ కాట్రేనికోన, జనవరి 10 ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పి ఎం జె జె బి వై) పథకం ద్వారా వార్షిక ప్రీమియం కేవలం 436 రూపాయలు చెల్లించడం ద్వారా సహజ మరణం పొందిన ఖాతాదారునికి రెండు లక్షల రూపాయల జీవిత బీమా లభిస్తుందని కాట్రేనికోన స్టేట్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ వై.వెంకటేష్ తెలిపారు. కాట్రేనికోన మండలం బలుతిప్ప గ్రామానికి చెందిన మేడా జయ నారాయణ ఇటీవల మరణించగా ఆయన భార్య కామేశ్వరికి రెండు లక్షల రూపాయల బీమా చెక్కును శుక్రవారం మేనేజర్ అందించారు. ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ మాట్లాడుతూ బ్యాంకులో ఖాతా ఉన్న ప్రతి ఒక్కరూ జీవిత బీమా, ప్రమాద బీమా పాలసీ చేయించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్ మహేష్ బాబు,స్టేట్ బ్యాంక్ సిబ్బంది, కియోస్క్ బ్యాంక్ ఆపరేటర్లు పెయ్యల సురేష్ బాబు, పాలెపు సత్యానందం, ఎం .రాంబాబు తదితరులు పాల్గొన్నారు