

జనం న్యూస్ //ఫిబ్రవరి //17//జమ్మికుంట //కుమార్ యాదవ్..జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఆబాది జమ్మికుంట 14 వార్డ్ లొ జార్ఖండ్ రాష్ట్రం డుంక్కా జిల్లా కలెక్టర్ దొడ్డే ఆంజనేయులు తన నూతన గృహప్రవేశ కార్యక్రమానికి డిసిసి అధ్యక్షుడు డాక్టర్ కపంపల్లి సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ ఒడితల ప్రణబ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారికి కలెక్టర్ ఆంజనేయులు స్వాగతం పలికి ఇంట్లోకి ఆహ్వానించారు. తదనంతరం దొడ్డె పోచయ్య మెమోరియల్ ట్రస్ట్ లోగోను వారిచే ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.