

జనం న్యూస్ -ఫిబ్రవరి 18- నాగార్జున సాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం చలకుర్తి గ్రామానికి చెందిన పాతనబోయిన సంతోష్ కుమార్ హైదరాబాదు లోని డిపార్క్ హోటల్లో టైకున్ మీడియా నిర్వహించినటువంటి తెలంగాణ బిజినెస్ ఇన్నోవేషన్ అవార్డును సినీనటి ప్రముఖ హీరోయిన్ భూమిక చావ్లా చేతుల మీదుగా అందుకున్నారు . ఇట్టి అవార్డు ఏడిఎంఎస్ ఎలక్ట్రికల్ బైక్స్ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్ గా ఉంటూ ఎలక్ట్రిక్ వాహనాల ఆవశ్యకత తెలియజేస్తూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తూ ఎలక్ట్రికల్ వాహనాలు వాడడం ద్వారా డబ్బు కూడా ఆదా చేసుకోవచ్చని తెలియజేస్తూ అనతి కాలంలోనే సేల్స్ రంగంలో నూతన ఒరవడిని సృష్టించి రాష్ట్ర నలుమూలల 100కు పైగా షోరూమ్ లను ఏర్పాటు చేసి ఇవి బిజినెస్ ప్రపంచంలో కొత్త చరిత్ర సృష్టించినందుకు గాను టైకున్ మీడియా బెస్ట్ ఇవి డిస్ట్రిబ్యూటర్ అవార్డును అందజేశారు . ఈ సందర్భంగా వ్యాపారవేత్త అయినటువంటి సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేయడానికి ఈ అవార్డ్ స్ఫూర్తినిస్తుందని నూతనంగా వ్యాపార రంగంలో అడుగుపెట్టే యువ వ్యాపారవేత్తలకు మార్గదర్శకంగా ఉంటుందని తనకు అవార్డు అందించిన టైటిల్ మీడియాకు అదేవిధంగా సినీనటి భూమిక చావ్లా కు ఈ అవార్డు అందుకోవడానికి ముఖ్య కారణమైనటువంటి ఏడిఎంఎస్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేశారు.