Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 17 రిపోర్టర్ సలికినిడి నాగరాజు బహుజన సమాజ్ పార్టీ (BSP) మాల మహానాడు ఆధ్వర్యంలో ఆందోళన నరసరావుపేటలోని డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్ అర్హత లేకుండా ENT వైద్యం చేసి సంతమాగులూరు గ్రామానికి చెందిన బిల్లా విక్రమాదిత్య. 3 మూడు సంవత్సరాల బాలుడు ప్రాణాలను బలిగొన్న అంజిరెడ్డి హాస్పటల్ యాజమాన్యం పై చర్య తీసుకోవాలని బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు బోదాల బాబురావు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్ పాల్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేయడం జరిగినది ఈ సందర్భంగా వాళ్లు మాట్లాడుతూ అంజిరెడ్డి హాస్పిటల్ లో ఇఎన్టి సౌకర్యం లేకపోయినా ఆ బాలుడికి చెవుడు మూగ సమస్యలను తీర్చి వేస్తానని నమ్మవలకి వారి దగ్గర అధిక సంఖ్యలో డబ్బులు వసూలు చేసి ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్లి వైద్యం చేతకాక మూడు సంవత్సరాల విక్రమాదిత్య ప్రాణాలు బలిగొన్నారని ఇలాంటి సంఘటనలు హాస్పటల్లో నెలకు రెండు జరుగుతున్నాయని వెంటనే అంజిరెడ్డి హాస్పటల్ లైసెన్స్ రద్దుచేసి వైద్యులపై తగిన చర్యలు తీసుకొని వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలు మాల మహానాడు కార్యకర్తలు మృతుని బంధువులు పాల్గొన్నారు