Listen to this article

జనం న్యూస్17 ; ఫిబ్రవరి (కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెల్ల శంకర్) తెలంగాణ రాష్ట్రంలో బీసీల ఆత్మగౌరవ పోరాటంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరల లెక్కించని కుటుంబాలను లెక్కించాలని తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ప్రభుత్వ బల్దియా టోల్ ఫ్రీ నెంబర్ 040-21111111 కాల్ చేస్తే ఎన్యుమారేటర్ మన ఇంటికే వచ్చి కుటుంబ లెక్కలు కులానికి సంబంధించిన లెక్కలు సామాజిక స్థాయి వివరాలన్నిటిని నమోదు చేస్తారు రాష్ట్రంలో బీసీలందరూ మన హక్కులను మనమే ఐక్యంగా పోరాడి సాధించుకోవాలని గత 75 సంవత్సరాలుగా బీసీలకు జరుగుతున్న అన్యాయాలను ఎండగట్టాలని ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు కురిమెల్ల శంకర్, ప్రధాన కార్యదర్శి భూపతి శ్రీనివాసరావు జిల్లా నాయకులు కాసు రామాచారి జక్కుల పాల్గుణ తదితరులు పాల్గొని పిలుపునిచ్చారు