

చర్యలు తప్పవు : టి యు డబ్ల్యూ జే 143 రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్కే దయాసాగర్
జనం న్యూస్ ఫిబ్రవరి 17 ;కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ 143 సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు అల్లం నారాయణ సారథ్యంలో టి జెఎఫ్ ఉద్యమ సంఘంగా ,తదనంతరం టి యు డబ్ల్యూ జే గా రూపాంతరం చెంది క్రమ శిక్షణ గల సంఘం గా ముందుకు సాగుతున్న విషయం సభ్యులందరికీ తెలిసిందే. యూనియన్ కూకట్పల్లి కార్యవర్గం రద్దయిన నేపథ్యంలో నూతన కార్యవర్గం నియామక ప్రకటన తాజాగా రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ ,ప్రధాన కార్యదర్శి అస్కాని మారుతీ సాగర్ ల చేతులమీదుగా వెలువడింది. గత కమిటీ పనితీరు సరిగా లేనందున, ఇతర వ్యవహారాలను దృష్టిలో పెట్టుకొని పని చేసే బాధ్యులకు ఇక్కడ బాధ్యతలు అప్పగించాలని రాష్ట్ర కమిటీ గత కొంతకాలం క్రితమే నిర్ణయం తీసుకుంది.ఈ విషయం సభ్యులందరికీ తెలుసు .టీజేఎఫ్ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టులకు అవకాశం ఇస్తే బాగుంటుందని రాష్ట్ర కమిటీ ఒక నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలో కమిటీ ప్రకట కూకట్పల్లి చెందిన యూనియన్ సీనియర్ నాయకులు రాష్ట్ర కమిటీ దృష్టికి తీసుకెళ్ళి వారికి బాధ్యతలు ఇప్పించడం జరిగింది. త్వరలో యూనియన్ మొదటి నుంచి పని చేస్తున్న క్రియాశీలక సభ్యులందరితో చర్చించి మిగతా పూర్తిస్థాయి కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. అయితే ఇక్కడి సంఘంలో సభ్యులుగా ఉన్న ఒకరిద్దరు ..సభ్యులు కానీ మరి కొందరిని తీసుకెళ్ళి రాష్ట్ర అధ్యక్షుల ని కలిసి తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేయడం జరిగింది. ఇలాంటి చర్యలు యూనియన్ నియమావళి కి విరుద్ధంగా, క్రమశిక్షణ రహితంగా ఇష్టానుసారంగా అనని మాటలను అన్నట్లు ప్రచారం చేసి మానసిక ఆనందం పొందుతున్న వారిని ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించేది లేదని రాష్ట్ర కమిటీ తెలియజేస్తుంది. యూనియన్ అంతర్గత వ్యవహారాలను అంతర్గతంగా చర్చించుకోవాలి తప్ప బహిర్గత పర్చి క్రమశిక్షణ ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా యూనియన్ నియమావళికి విరుద్ధంగా సోషల్ మీడియాలో సంఘ ప్రతిష్ట దెబ్బతీసే విధంగా పోస్టులు చేస్తూ నూతన కమిటీ రద్దయినట్లు ప్రకటన చేయటం ఆక్షే పనీయం. యూనియన్ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండని వారు యూనియన్ లో స్థానం ఉండదనే విషయాన్ని తెలుసుకుంటే మంచిది.సంఘ నియమావళిని ఇదే రకంగా ఉల్లంఘించిన ఎడల వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకొని సభ్యత్వాన్ని రద్దు చేయడం రుగుతుందననే విషయాన్ని వెల్లడిస్తూ , త్వరలోనే టీయూడబ్ల్యూజే సభ్యులుగా ఉన్న అందరం కలిసి పూర్తిస్థాయి కమిటీని నిర్మించుకుందామని ఈ ప్రాంతం నుంచి రాష్ట్ర బాధ్యులుగా కొనసాగుతున్న మేము వెల్లడిస్తున్నాము. ఈ ప్రకటన వెలువడిన తర్వాత సైతం ఎవరైనా సోషల్ మీడియా వేదిక ద్వారా తప్పుడు ప్రచారం చేస్తే తప్పనిసరిగా కఠిన చర్యలు ఉంటాయని చ్చరిస్తున్నాము.