

జనం న్యూస్ ఫిబ్రవరి 17 సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో సోమవారం నాడు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదిన వేడుకలను సూర్యాపేట జిల్లా మాజీ చైర్ పర్సన్ గుజ్జ దీపిక యుగంధర్ రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించినారు. హాస్పిటల్లో రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేసినారు. కేటీఆర్ ఆదేశానుసారము ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటినారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య , మాజీ ఎంపిపి గుండ గాని కవిత రాములు మరియు అన్ని గ్రామల ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.