

జనం న్యూస్ 17 ఫిబ్రవరి (కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెల్ల శంకర్) మా తండ్రిగారైన భూపతి అప్పారావు వారి జీవిత కాలములో విద్య, స్థాపన, మండల వనరుల కేంద్రం,పతకం లో భాగంగ MPUPS-రావికంపాడు లో అసంపూర్తిగా గల ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి అదనపు గదులు నిర్మించినారు. అట్టి నిర్మాణం పూర్తి అయినప్పటికి ఇప్పటివరకు సదరు బిల్లుకు సబంధించిన రు.1,35,000/-(అక్షరాల ఒక లక్షా ముప్పై అయిదు వేల రూపాయలు) లు రావలసి యున్నది. కాని ఇప్పటివరకు బిల్లు రాలేదు.ఈ డబ్బులు .1,35,000/- అప్పుచేసి సదరు స్కూలు యొక్క 4వ తరగతి అదనపు గదులు నిర్మించియున్నాడు. పూర్తి చేసిన కొన్ని రోజులకు మా తండ్రి మరణించినారు . సదరు అప్పుగా తెచ్చిన డబ్బులకు వడ్డీలకు వడ్డీలు కడుతూ నేను, నా కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడుచున్నాము. అప్పులవాట్లు మా కుటుంబాన్ని నిలదీస్తున్నారు. నేను, నా భార్య, నా కూతురు ఈ అప్పుల వలన మానసికంగా కృంగిపోవుదున్నాము. ఇంట్లో వుండే పరిస్థితిలేదు. దీని వల్ల మా అమ్మగారికి ఆరోగ్యం రోజురోజుకు ణిస్తున్నది. ఈ పై విషయము గురించి అధికారులకు దరఖాస్తు పెడుతున్నప్పటికీ పట్టించుకోవడం లేదు కావున దయగల తమరు నా పరిస్థితిని అర్ధంచేసుకొని మా నాన్నగారి ద్వారా మాకు రావలసిన విద్య, స్థాపన, మండల వనరుల కేంద్రం, పదకం ద్వారా నిర్మించిన అదనపు తరగతిగదులకు సంబందించి డబ్బులు మంజూరు చేసి ఇప్పించి మా కుటుంబాన్ని అదకోగలరని భూపతి శ్రీనివాసరావు కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు