Listen to this article

మళ్లీ కెసిఆరే కావాలంటున్న ప్రజలు : టిఆర్ఎస్ అధ్యక్షులు నేరల్ల సుమన్ గౌడ్

జనం న్యూస్ :ఫిబ్రవరి 17 ; జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలం లో ఖ్యమంత్రిగా మళ్లీ కెసిఆరే కావాలని ప్రజలు కోరుకుంటున్నారని బీరు పూర్ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నేరల్ల సుమన్ గౌడ్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన సందర్భంగా సోమవారం బీరు పూర్ మండల కేంద్రం లో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బాణాసంచా కాల్చి, మిఠాయి పంపిణీ చేసి, కేక్ కట్ చేసి కెసిఆర్ జన్మదినం ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నేరల్ల సుమన్ గౌడ్, మాజీ ఎంపిపి కోలుముల రమణ యాదవ్ మండల ప్రాదాన కార్యదర్శి యూయ్యల కిషన్ మేర్గు రాజేశం మాజీ సర్పంచ్ లు మాజీ ఎంపీటీసీ సభ్యులు ముఖ్య కార్యకర్తలు నాయకులు, ప్రజలు పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. .