

జనం న్యూస్ //ఫిబ్రవరి //17//జమ్మికుంట //కుమార్ యాదవ్ . గ్రామీణ పేదరిక నిర్ములన సంస్థ (సెర్ప్ ) అరుణోదయ మండల సమాఖ్య కార్యాలయం లో మహిళాలకు ఆహారం, ఆరోగ్యం, అనే అంశాలపై శిక్షణ మరియు అవగాహనా కార్యక్రమం మండల సమాఖ్య జమ్మికుంట ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది, ఈ అరోగ్య అవగాహణ కార్యక్రమాల్లో వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హెల్త్ ఎడ్యూకెటర్ మోహన్ రెడ్డి పాల్గొని , వివిధ గ్రామాలనుండి వచ్చినా మహిళ సంఘాల మహిళ అధ్యక్షులకు అరోగ్య మహిళ కార్యక్రమంపై అవగాహణ కల్పించారు . మహిళలు ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబానికి రక్ష అని హెల్త్ ఎడ్యుకేటెర్ మోహన్ రెడ్డి అన్నారు. కుటుంబంలో మహిళల పాత్ర ముఖ్యమని , వారు ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబానికి ఎలాంటి ఇబ్బందులూ ఉండవని అన్నారు.అరోగ్య మహిళా కార్యక్రమమును ప్రతి మహిళా వినియోగించుకొని అరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా లబ్ధి పొందాలన్నారు. ప్రతి మంగళవారం మరియు గురువారం మహిళలకు ఉచితముగా అరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అరోగ్య పరిరక్షణ పట్ల తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించారు. పోషకాహారం గురించి , వ్యక్తిగత పరిశుభ్రత గురించి, రక్త హీనతగురించి, చేతుల పరిశుభ్రత గురించి మహిళలకు అవగాహణ కల్పించారు, మహిళల ఆరోగ్యం కోసం ప్రతి గ్రామం లో అరోగ్య కార్యక్రమాలు చేపడుతున్నాం అన్నారు. టీ బి ముక్త్ పోగ్రంలో బాగంగా టిబి సూపర్ వైజర్ దేవేందర్ రెడ్డి టీబీ వ్యాధి పై అవగాహణ కల్పించారు.ఇట్టి కార్యక్రమం లో ఏపీఎం శ్రీనివాస్,హెల్త్ ఎడ్యూకేటర్ మోహన్ రెడ్డి హెల్త్ సూపర్ వైజర్స్ రత్నకుమారి ,దేవేందర్ రెడ్డి, తిరుపతి ,సీసీ లు మొగిలి సురేష్ సరిత, శ్రీనివాస్, రాజేందర్, మండలసమాఖ్య అధక్షురాలు శృతి, కార్యదర్శి రజిత కోశాధికారి భవాని, మండల సమాఖ్య సిబ్బంది అనూష, శ్రీనివాస్, సుమలత, పలు గ్రామాల గ్రామైక్య సంఘ అధ్యక్షులు, హెల్త్ కమిటీ మెంబెర్స్ పాల్గొన్నారు.