

జనం న్యూస్ ఫిబ్రవరి 17 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ తూర్పు పశ్చిమగోదావరి ఎమ్మెల్సీ ఎన్నికల కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరo విజయానికి భీమవరం టౌన్ లో ఎన్నికల ప్రచారాన్ని భీమవరం నియోజవర్గం శాసనసభ్యులు పులవర్తి రామాంజనేయులు మాజీ పార్లమెంట్ సభ్యులు భీమవరం నియోజవర్గం ఇంచార్జ్ తోట సీతామాలక్ష్మి భీమవరం నియోజవర్గం ఎన్నికల పరిశీలకు మాజీ శాసనమండలి సభ్యులు బుద్ధ నాగ జగదీశ్వరరావు ప్రచారంలో పాల్గొని సమావేశంలో నాగ జగదీష్ మాట్లాడుతూ గ్రాడ్యుయేట్స్ ను కలుసుకొని కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతీ యువకులకు 20 లక్షల ఉద్యోగాలు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలు ప్రకారం ఏడు మాసాల్లో 6 లక్షల 43 వేల కోట్లు పెట్టుబడులతో నాలుగు లక్షల ఉద్యోగాలు వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని, అలాగే మెగా డీఎస్సీ వల్ల 16,464 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్ విడుదలవుతుందని, రాజశేఖరంకు మొదట ప్రాధాన్య ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిడిపి కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, టిడిపి పట్టణ ప్రెసిడెంట్ ఇందూరి సుబ్రమణ్యం రాజు టిడిపి నాయకులు పుత్తూరు బాపిరాజు టిడిపి జనసేన బిజెపి నాయకులు పాల్గొన్నారు.