Listen to this article

జనం న్యూస్. ఫిబ్రవరి 17 . మెదక్ జిల్లా. నర్సాపూర్ . కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) నర్సాపూర్ మున్సిపల్ పట్టణంలోని ఏ ఆర్ ఆర్ క్యాంపు కార్యాలయంలో హత్నూర మండలానికి చెందిన పలువురు లబ్బిదారులు మెరుగైన చికిత్స కోసం సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా వారికి మంజూరైన ₹7,00,500. రూపాయల విలువైన చెక్కులను కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అందజేసిన టిపిసిసి ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సహాయం అందేలా. ప్రజల క్షేమమే ప్రధాన లక్ష్యంగా, నిరంతరం ఆవుల రాజిరెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని సీఎం సహాయ నిధి లబ్ధిదారులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ, ప్రజల కష్టాలు తీర్చే విధంగా, ప్రభుత్వ పథకాలను మరింత వేగంగా అందించేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ మైనారిటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి ఎం.ఏ.హకీం, హత్నూర మండల పార్టీ ధ్యక్షులు కర్రే క్రిష్ణ, ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర నాయకులు. చార్ల మణిదీప్. ఎన్ ఎస్ యు ఐ నర్సాపూర్ నియోజకవర్గ న్చార్జ్. ప్రభు లింగం.ఆంజనేయులు,వెంకటేశ్,సాధిక్,ప్రసాద్, స్థానిక నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు