

-ప్రయాణికులకు తప్పని తిప్పలు
జనం న్యూస్, ఫిబ్రవరి 18, (తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం గణేష్ పల్లి గ్రామంలో ఎన్నో సంవత్సరాల క్రితం సేవా భావంతో సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో నిర్మించిన బస్టాండ్ అర్ధరాత్రి, గుర్తుతెలియని వ్యక్తులు బస్టాండ్ కూల్చినట్టు స్థానికులు చెబుతున్నారు.ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ ప్రతినిత్యం గణేష్ పల్లి వద్ద బస్టాండ్ లో ఎంతోమంది ప్రయాణికులు బస్ కోసం వేచి చూస్తారని ఎండాకాలంలో ఎండలు విపరీతంగా ఉన్న,ఈ సమయంలో బస్టాండ్ కూల్చడం బాధాకరంగా ఉందని, ఈ సంఘటనకు పాల్పడిన వ్యక్తులను, వెంటనే శిక్షించాలని మళ్లీ ప్రభుత్వం నూతనంగా బస్టాండ్ నిర్మించాలని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.