

జనం న్యూస్ 18 : ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ శ్రీను మక్కువ ప్రజాశక్తి విలేకరి రామారావుపై దాడిని జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో సోమవారం ఖండించారు. ప్రజాస్వామ్య మనుగడకు మూల స్తంభంగా ఉన్న మీడియా ప్రతినిధులపై దాడి చేసి బెదిరించడం సరికాదన్నారు. ఏదైనా నచ్చని వార్తలు రాస్తే ఖండించాలి తప్ప దాడులు చేయడం సరికాదన్నారు. దాడి చేసిన టీడీపీ మండల అధ్యక్షుడు వేణుగోపాలనాయుడుపై చర్యలు తీసుకోవాలని కోరారు.