

ఒకఎకరాని1,50,000రూపాయలు నష్ట పరిహారం ఇవ్వాలి
పిబ్రవరి 18: జనంన్యూస్ వెంకటాపురం మండలరిపోర్టర్ బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలంలో బిజెపి పార్టీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు తోట సతీష్ మాట్లాడుతూ బహుళ జాతి మొక్కజొన్న విత్తనాలైనా హైటెక్ ,సింజంట కంపెనీల పై కఠిన చర్యలు తీచుకోవాలని అన్నారు ఆర్గానేజర్లు అధిక దిగుబడి వస్తుంది అని అన్నిటికి మేము ఉన్నామని రైతులకు మా కంపిని ఇస్తున్న టువంటి సీడ్ మంచి దిగుబడులు వస్తాయని రాకపోతే కంపినిలు నష్ట పరిహారం ఇస్తుందని నమ్మించి పెట్టుబడులు పెట్టతమని ఆశ చూపించి రైతులను మభ్యపెట్టి గిరిజన, గిరిజనేతరుల రైతులతో పంటలు మొక్కజొన్నల సీడ్ పెట్టించి రైతులను మోసం చేశారు.రైతులు దిగుబడి రాక చాలా నష్టపోయరని రైతులకు ఒక ఎకరాన 1,50,000 నష్టపరిహారాన్ని నేరుగా రైతుల ఖాతాలో జమ చేయాలని రైతులకు తగు న్యాయం చేయాలని డిమాండ్ చేసారు ఆర్గానేజర్లు ఆయా కంపినిలా అధికారులను పిలిపించి రైతులకు తగు న్యాయం చేయాలని లేకపోతే ఆర్గానేజర్లు లే బాధ్యత తీసుకోవాలిసి వస్తుందని హెచ్చరించారు ఈ బహుళ జాతి విత్తనాల మొక్క జొన్నల రైతులకు ఎటువంటి లాభాలు లేవని కేవలం ఆర్గానేజర్లు బాగుపడటంతప్ప రైతులకు వారిగేది ఏమిలేదని అన్నారు భారతీయ జనతా పార్టీ తరఫున వెంకటాపురం మండల తాసిల్దార్ లక్ష్మి రాజయ్య కి, అగ్రికల్చర్ ఆఫీసర్ కి వినతి పత్రం అందజేయడం జరిగింది. అదేవిధంగా బహుళ జాతి మొక్కజొన్న విత్తన కంపెనీల పై తగు చర్యలు తీసుకోవాలని లేకపోతే రైతుల లో ఆందోళన చేస్తామని సంబంధిత అధికారులను కోరడమైనది . ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రామెల్ల రాజశేఖర్, జిల్లా కౌన్సిల్ మెంబర్ బొల్లె సునీల్ ,మండల కార్యదర్శి సాధన పల్లి విజయ్ మండల యువమోర్చా అధ్యక్షుడు నోముల శ్రీ కిషన్, కలవచర్ల నవీన్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు
