Listen to this article

హిందూ ధర్మానికి వన్నె తెచ్చిన వీరుడు శివాజీ -అతని శౌర్యం, ధైర్యం ప్రతి భారతీయునికి ఆదర్శం

జనం న్యూస్, ఫిబ్రవరి 18, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) ఛత్రపతి శివాజీ జయంతిని సందర్బంగా సబ్బుబిళ్ల మీద శివాజీ చిత్రాన్ని చిత్రించి ఘన నివాళులు అర్పించారు.సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన రామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రతి భారతీయుని గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోన మహానుభావుడు,ఛత్రపతి శివాజీ, అన్నారు. మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించి, హిందూ ధర్మానికి వన్నె తెచ్చిన వీరుడు, ఓటమి ఎరుగని ధీరుడు అన్నాడు. దైవభక్తికి మహిళల పట్ల ఆకుంటిత భావం కల్గిన, మరాఠ సామ్రాజ్య స్థాపకులు శివాజీ అన్నారు.