Listen to this article

పాలకమండలి ఏర్పాటు చేయని అధికారులు
BJYM మెదక్ జిల్లా అధ్యక్షులు సతీష్ పటేల్
.

జనం న్యూస్ ఫిబ్రవరి 18 మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ప్రతి నిధి యల్ సంగమేశ్వర్.
ఈరోజు రాష్ట్రంలో ప్రఖ్యాతిగాంచిన ఏడుపాయల వన దుర్గ మాత దర్శనం చేసుకోవడం జరిగింది
ఈ సందర్బంగా BJYM జిల్లా అధ్యక్షులు సతీష్ పటేల్ మాట్లాడుత్తు రాష్ట్రంలో రెండవ అతిపెద్ద పుణ్యక్షేత్రమైన ఏడుపాయల దేవస్థానం అభివృద్ధి పరచకపోవడం చాలా బాధాకరమని,గత బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నన్ని రోజులు అసెంబ్లీ సాక్షిగా ఏడుపాయల కు 100 కోట్లతో అభివృద్ధి చేస్తామని చెప్పి మాటలకే పరిమితం కావడం జరిగింది ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మాటలతో కాలయాపన చేయడం సిగ్గుచేటు ఏడుపాయల పుణ్యక్షేత్రానికి మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రావడం చాలా సంతోషం కానీ ఏడుపాయల దేవస్థానానికి ఎలాంటి అభివృద్ధికి నిధులు విడుదల చేయకపోవడం బాధాకరమైన విషయం ప్రభుత్వానికి ఆదాయం తీసుకురాని ప్రభుత్వ ఆధీనంలో లేని మెదక్ చర్చికి 29 కోట్లు ముఖ్యమంత్రి ఇవ్వడం జరిగింది కానీ ప్రభుత్వానికి ఆదాయం తీసుకొచ్చే దేవదాయ శాఖ ఆధీనంలో ఉన్న ఏడుపాయల దేవస్థానాన్ని గాలికి వదిలేయడం జరిగింది చర్చికి 29 కోట్లు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాము అలాగే ఏడుపాయల అభివృద్ధి కూడా నిధులు తీసుకురావాలని కోరుకుంటున్నాం ఏడుపాయల అమ్మవారి జాతర సమయంలో కూడా బంగారు నగలు అలంకరించకపోవడానికి గల అంతర్యం ఏమిటి బంగారు నగలు అమ్మవారివి ఎక్కడ ఉన్నాయి అని సూటిగా ప్రశ్నించడం జరుగుతుంది గతంలో ఉన్న దేవదాయ శాఖ ఈవో బంగారు నగలని ఇంటికి తీసుకెళ్లిన కేసు దర్యాప్తు ఎక్కడ వరకు వచ్చింది పాలకమండలి నియమించక పోవడానికి గల కారణం ఏమిటి,వచ్చే శివరాత్రి జాతరకి అమ్మవారి బంగారు ఆభరణాలతో అలంకరించాలని లేనియెడల BJYM ఆధ్వర్యంలో EO కార్యాలయన్ని ముట్టడిస్తాం అని హెచ్చరించాడం జరుగుతుంది భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది ఈ సమావేశంలో బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నరేన్ దేశ్ పాండే,రాష్ట్ర నాయకులు వాళ్దాస్ అరవింద్ ,లీగల్ సెల్ కన్వీనర్,గిరి ,సతీష్ , జగదీష్,అనిల్ శ్యామ్ కొల్చారం బీజేపీ నాయకులు BJYM నాయకులు పాల్గొనటం జరిగింది…