Listen to this article
  • జనం న్యూస్ పీబ్రవరి 18 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ శ్రీ డివి శ్రీనివాస్ రావు ఐపీఎస్ ఆదేశాల మేరకు, అడిషనల్ ఎస్పీ ప్రభాకర్ రావు పర్యవేక్షణ లో మంగళవారం కెరమెరి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్ధి విద్యార్థినిలకు షీటీమ్ మరియు భరోసా ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డబ్ల్యు.ఎస్.ఐ శిరీష మరియు భరోసా ఇంచార్జ్ డబ్ల్యు.ఎస్.ఐ తిరుమల మాట్లాడుతూ..బాల బాలికలకు గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్ , ఫోక్సో చట్టం గురించి మరియు పోక్సో చట్టం ప్రకారం అమలులో ఉన్న శిక్షల గురించి, బాల్య వివాహ నిరోధక చట్టం గురించి వివరించడం జరిగింది. అత్యాచార బాధితులు భరోసా సెంటర్ ను ఎలా ఆశ్రయించవచ్చు వారికి భరోసా సెంటర్లో లభించే సదుపాయాలు మరియు సేవల గురించి వివరించడం జరిగింది. బాలబాలికలకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ఎలా ముందుకు వెళ్లాలో వివరించడం జరిగింది. ప్రస్తుత సమాజంలో ఉన్న పరిస్థితులను గురించి అవగాహన కల్పించడం జరిగింది. మొబైల్ ఫోన్స్ ద్వారా ఉండే లాభాలు , నష్టాలు గురించి తెలియజేశారు.షీ టీం ఇంచార్జ్ ఎస్సై వెంకటేశ్వర్ మాట్లాడుతూ. మహిళలపై హింస , ఈవ్టీజింగ్ , సైబర్ క్రైమ్ లకు ఎవరైనా గురి అయినట్లయితే వెంటనే షీటీం ను సంప్రదించాలని సూచించారు. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల అయినా ఫేస్బుక్, వాట్సప్, ఇన్స్టాగ్రామ్ వంటి వాటిని వినియోగంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసే సమయంలో వ్యక్తిగత భద్రతకు సంబంధించిన గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు. అదేవిధంగా జిల్లాలోని మహిళలకు రక్షణ కల్పించడం కోసమే షీ టీం , భరోసా సెంటర్లు పనిచేస్తున్నాయని, అలాగే ఏదైనా అత్యవసర సమయంలో డయల్ 100కు కాల్ చేయాలని పేర్కొన్నారు. భరోసా నెంబర్ 8712670561, షీ టీం నెంబర్ 87126 70564 చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నెంబర్ 1930 సంప్రదించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ మరియు సిబ్బంది షీ టీం సభ్యులు శ్రీలత, భరోసా సభ్యురాలు విజయ పాల్గొన్నారు.