Listen to this article

జనం న్యూస్ :18: ఫిబ్రవరి మంగళవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి;చిన్నకోడూరు మండలనికి చెందిన పులి పుష్పలత, సుమన్ దంపతుల కుమార్తె పులి శ్రీనిధికి గుండె ఆపరేషన్ కావడం వల్ల వారి కుటుంబ నికి సిద్దిపేట నియోజికవర్గ ఇంచార్జ్ పూజల హరీ కృష్ణ ఆదేశాల మేరకు సీఎం సహాయ నిధి నుండి వారికీ 22000 చెక్కును అందజేయడం జరిగింది. ఈ సందర్బంగా చిన్నకోడూరు మండల కాంగ్రెస్ అధ్యక్షులు మీసం మహేందర్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబలకు సీఎం సహాయనిది ఒక వరం లాంటిదని ఈ సందర్బంగా కాంగ్రెస్ ప్రభుత్వనికి, దీనికి సహాకరించిన ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు దామోదరా రాజానర్సింహా తజ్ఞతలు తెలియజేసారు .ఈ కార్యక్రమం లో అర్బన్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొలిమి బిక్షపతి, చిన్నకోడూరు మండల ఉపఅధ్యక్షులు సందబోయిన పర్శరాం, కిసాన్ సెల్ జిల్లా కార్యదర్శి పాకాల భూపతి రెడ్డి నాయకులు నక్క రాజు,పెంబర్ల మల్లేశం, మల్కా మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.