Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 18 రిపోర్టర్ సలికినిడి నాగరాజు 8 నెలల పాలనకు మద్ధతు తెలపండి మాజీమంత్రి ప్రత్తిపాటి పట్టణంలో పలు ప్రైవేట్ విద్యాసంస్థల ఉపాధ్యాయులను కలిసి రాజేంద్రప్రసాద్ విజయానికి సహకరించాలని కోరిన ప్రత్తిపాటి. గత పాలకులు ప్రజల స్వేఛ్చను హరించి, దుర్మార్గాలు.. అరాచకాలకు పాల్పడ్డారని, కూటమి ప్రభుత్వం ప్రజల ఆలోచనలు, అభిప్రాయాలను గౌరవిస్తూ పాలన సాగిస్తోందని, పట్టభద్ర ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ గెలుపు అందరికీ ఎంతో అవసరమని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టంచేశారు. మంగళవారం ఆయన పట్టణంలోని పలు ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఆలపాటికి మద్ధతుగా విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రైవేట్ ఉపాధ్యాయులను ఉద్దేశించి పుల్లారావు మాట్లాడారు. చాలీచాలని జీతాలతో జీవితాలు నెట్టుకొస్తున్న ప్రైవేట్ ఉపాధ్యాయులకు మద్ధతుగా ప్రభుత్వం తరుపున తగిన సహాయసహకారాలు అందించడానికి నా వంతు కృషి చేస్తానని ప్రత్తిపాటి హామీ ఇచ్చారు. త్వరలో ప్రభుత్వం విడుదల చేయబోయే డీఎస్సీ నోటిఫికేషన్ ను అర్హులైన ప్రైవేట్ ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జేంద్రప్రసాద్ కు తొలిప్రాధాన్యతా ఓటు వేసి, కూటమి ప్రభుత్వ 8 నెలల పాలనకు మంచి విజయంతో సంఘీభావం తెలపాలని పుల్లారావు ఉపాధ్యాయులకు సూచించారు. రెండో ప్రాధాన్యతా ఓటుకి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేకుండా చూడాలన్నారు. నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు పోలం రెడ్డి దినేశ్ రెడ్డి కూడా ఎంతో కష్టపడి ఎదిగాడని పుల్లారావు చెప్పారు. తన గెలుపులో కీలక పాత్ర పోషించిన ఉపాధ్యాయులందరూ తాజాగా ఆలపాటి విజయంలో కూడా కీలక భాగస్వాములు కావాలని పుల్లారావు కోరారు. ప్రైవేట్ ఉపాధ్యాయుల మస్యల పరిష్కారానికి రాజేంద్రప్రసాద్ తప్పకుండా తనవంతు కృషి చేస్తాడని ప్రత్తిపాటి తెలియచేశారు. ఆలపాటికి మద్ధతుగా చైతన్య లిటిల్స్, చైతన్య టెక్నో, శ్రీ చైతన్య, నారాయణ జూనియర్ కాలేజీల, మోడ్రన్ గ్రీన్ వ్యాలి ఉపాధ్యాయులను కలిసి ప్రత్తిపాటి ఓట్లు అభ్యర్థించారు. కార్యక్రమంలో జనసేనా ఇంచార్జి తోట రాజా రమేష్, బీజేపీ నాయకులు జయరామి రెడ్డి, టీడీపీ నాయకులు షేక్ టీడీపీ కరీముల్లా, నెల్లూరి సదాశివరావు, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు పఠాన్ సమద్ ఖాన్, మధుమాల రవి పార్టీ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.