Listen to this article

జనం న్యూస్ //ఫిబ్రవరి //18//జమ్మికుంట //కుమార్ యాదవ్. జమ్మికుంట పట్టణంలోని మారుతి నగర్ లో గల, పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం 14వ వార్షికోత్సవ వేడుకలు, ఆలయ అర్చకులు సముద్రాల ప్రసాదాచార్యులు వేద మంత్రచారణల నడుమ మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకాలు, హోమం, బలిహరణ, మహా పూర్ణహుతి, కార్యక్రమాలు చేపట్టారు. సాయంత్రం పల్లకి సేవ, సహస్రనామా ఆర్చన, కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు ప్రసాద వితరణ, స్వామివారి తీర్థప్రసాదాలు అందించగా దాతల సహాయంతో అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పొన్నగంటి సంపత్, వేముల మహేందర్, లక్ష్మణ్, సమ్మయ్య, భక్తులు పాల్గొన్నారు.