Listen to this article

ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ ఫిబ్రవరి 18 : ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల మూలపోచారం పాఠశాలలో కెరీర్ గైడెన్స్ పై వర్క్ షాప్ నిర్వహించారు.కెరీర్ గైడెన్స్ వాల్ పోస్టర్లలను ట్రైబల్ వెల్ఫేర్ ఏ.ఈ.విజయ్, అసిస్టెంట్ ట్రైబల్ డెవలప్మెంట్ ఆఫీసర్ షేక్. జహీరుద్దీన్ మరియు వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న ఉద్యోగులు ఆవిష్కరించారు.అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి. నాగరాజు అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని అసిస్టెంట్ ట్రైబల్ డెవలప్మెంట్ ఆఫీసర్ షేక్ జహీరుద్దీన్ మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారు దీనిపై వారికి స్పష్టత కల్పించడంతోపాటు ఎలా ముందుకు సాగాలో తెలియజేసేందుకు ప్రేరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు.మన కెరీర్ ని ఏ విధంగా సన్నద్ధం కావాలో వివరించారు.ట్రైబల్ వెల్ఫేర్ ఏ.ఈ. విజయ్ మాట్లాడుతూ పాఠశాలలో చాలామంది విద్యార్థులు తమ భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారో చెప్పలేని పరిస్థితిలో ఉన్నారన్నారు. ఇది మారాలంటే వారికి లక్ష్యంపై స్పష్టత కావాలి. అందుకే ఈ వర్క్ షాప్ ని నిర్వహించారన్నారు. ఉపాధ్యాయ,ఆరోగ్య,అటవీ శాఖ,పోలీస్ శాఖ, ఇంజనీరింగ్ శాఖ ఆయా రంగాలలో స్థిరపడిన వారు వచ్చి ఎలా చదివితే ఆయా ఉద్యోగాలు వస్తాయో వారి అనుభవాల ద్వారా విద్యార్థులకు వివరించాలని కోరారు. ఈకార్యక్రమంలో విద్యాశాఖ నుంచి ఉపాధ్యాయురాలు దనసరి సుశీల,అటవీశాఖ నుంచి బీట్ ఆఫీసర్ చందు నాయక్, సిద్ధ రావు, పోలీసు శాఖ నుండి కానిస్టేబుల్స్ కొండయ్య, వెంకటేశ్వర్లు, ఆరోగ్య శాఖ నుండి డి.అరుణ ఏఎన్ఎం, పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.